ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైవే డాబాలపై ఆకస్మిక తనిఖీలు.. తాజ్ హోటల్ సీజ్ - inspections on high way Hotels

హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో హోటల్ యాజమాని నాగేశ్వరరావుపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్​ను సీజ్ చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పరిధిలోని తాజ్ హోటళ్ల​పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైవే డాబాలపై ఆకస్మిక తనిఖీలు.. తాజ్ హోటల్ సీజ్
హైవే డాబాలపై ఆకస్మిక తనిఖీలు.. తాజ్ హోటల్ సీజ్

By

Published : Apr 9, 2021, 9:15 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం పరిధిలోని హోటళ్ల​పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారిలో ఉన్న హోటళ్లపై ఫిరంగిపురం తహసీల్దార్ సాంబశివరావు విస్త్రృత తనిఖీలు చేపట్టారు.

హోటళ్లు సీజ్..

ఆహార పదార్థాలు మటన్, రొయ్యలు, తందూరి చికెన్, బాయిల్డ్ మటన్, చికెన్ లాంటి పదార్థాలు నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం తాజ్ హోటల్ లైసెన్స్ గడువు ముగిసినందున సీజ్ చేశారు.

తహసీల్దార్ ఆగ్రహం..

నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా, పన్నులు కట్టకుండా ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో హోటల్ యాజమాని నాగేశ్వరరావుపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు..

జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు హోటల్, ఆహార పదార్ధాలు తయారీ కేంద్రాలు, దుకాణాలు, సినిమా హాళ్లు వంటి వాటిల్లో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ డా. కోటేశ్వరమ్మ , రెవెన్యూ సిబ్బంది శ్రీనివాస్, సురేష్, పంచాయితీ సెక్రెటరీ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి : రెండేళ్లుగా వైకాపా ఏం చేసిందో సమాధానం చెప్పాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details