గుంటూరు జిల్లా పురుషోత్తపట్నంలోని కేదర్ క్రాప్ కేర్ పురుగు మందుల దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కల్తీ మందులు విక్రయిస్తున్నారని ఫిర్యాదు రావడంతో సోదాలు నిర్వహించారు. ట్రేసర్ 13 డబ్బాలు, డెలిగేట్ 2 డబ్బాలు కల్తీ పురుగుమందులు ఉన్నట్లు అధికారులు గుర్తించామన్నారు. తనిఖీలలో వ్యవసాయశాఖ ఉపసంచాలకులు రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస రావు, ఏవోలు రఘు, శ్రీలత పాల్గొన్నారు.
పురుగు మందుల దుకాణంలో అధికారుల తనిఖీలు - Inspections by Agriculture Department officials
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పురుషోత్తపట్నంలోని పురుగు మందుల దుకాణంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పురుగుమందులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.

తనిఖీలు చేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు