పంట వేసింది మొదలు.. చేతికొచ్చిన పంటను అమ్ముకునే వరకు రైతులకు ఉపయోగపడే విధంగా.. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. అన్నదాతల సలహాలు తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
గుంటూరులో రైతు భరోసా కేంద్రాల పరిశీలన - latest news for guntur raithu bharosa centers
గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని రైతు భరోసా కేంద్రాన్ని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. రైతులతో సమావేశమయ్యారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను అందరికీ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
గుంటూరులో రైతు భరోసా కేంద్రాల పరిశీలన