ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐఆర్‌ఆర్‌ కేసులో లోకేశ్​పై చర్యలకు అనుమతివ్వాలని సీఐడీ మెమో - AP CID Petition against nara lokesh

inner_ring_road_case
inner_ring_road_case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 3:26 PM IST

Updated : Dec 22, 2023, 3:56 PM IST

15:20 December 22

41ఏ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారన్న సీఐడీ

Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్​పై (Nara Lokesh) చర్యలకు అనుమతివ్వాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని సీఐడీ (AP CID) అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని సీఐడీ లాయర్లు కోర్టుకు తెలిపారు.

మెమోపై ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. సీఐడీ మెమోపై లోకేశ్ తరఫు లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా విజయవాడ ఏసీబీ కోర్టులోనూ సీఐడీ ఇలాంటి పిటిషనే వేసింది.

ఇదే కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు లాయర్లు లిఖితపూర్వక వాదనలను కోర్టులో దాఖలు చేశారు. అదే విధంగా సీఐడీ తరఫున సైతం లాయర్లు లిఖితపూర్వక వాదనలను సమర్పించారు. ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Last Updated : Dec 22, 2023, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details