ఓట్లేసి గెలిపించిన నేతలు మోసం చేసినా న్యాయస్థానాలు తమను ఆదుకున్నాయని రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న దీక్షలు 232 వ రోజుకు చేరుకోగా.. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని రైతులు, మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనను వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం నీరుకొండ, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతులు స్థానిక రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'నాయకులు మోసం చేసినా...న్యాయ స్థానాలు ఆదుకున్నాయి' - amaravathi latest news
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని రైతులు, మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న దీక్షలు 232 వ రోజుకు చేరుకోగా.. మంగళగిరి మండలం నీరుకొండ, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతులు స్థానిక రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీక్షలు చేస్తున్న రాజధాని రైతులు
తుళ్లూరు మండలం మందడం, అబ్బిరాజుపాలెం, దొండపాడు, పెదపరిమి, బోరుపాలెం, రాయపూడి గ్రామాల్లో రైతులు, మహిళలు చిన్నారులు అమరావతికి మద్దతుగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్...అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. న్యాయస్థానాలే తమను ఆదుకుంటాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.