రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కమిటీ చెక్‌పోస్టుల్లో పన్ను వసూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల మేరకు చెక్‌పోస్టుల వద్ద పన్ను వసూళ్లు సుమారు 8 నెలలుగా నిలిచాయి. చట్టాల అమలుపై సుప్రీంకోర్టు జనవరి 12న స్టే ఇచ్చింది. చట్టాలు అమలులోకి రానందున ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చెక్‌పోస్టులను పునరుద్ధరించి పన్ను వసూళ్లు ప్రారంభించాయి. రాష్ట్రంలోనూ గురువారం నుంచి వ్యవసాయ చెక్‌పోస్టులు తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతమి రావడంతో...మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న...అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి...పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 216 మార్కెట్ కమిటీల పరిధిలోని 450 చెక్‌పోస్టులు తెరచుకున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేస్తున్నవారి నుంచి ఒక శాతం మార్కెట్ రుసుము వసూలు చేస్తున్నారు.
వ్యవసాయ కమిటీ చెక్‌పోస్టుల్లో పన్ను వసూళ్లు ప్రారంభం - వ్యవసాయ కమిటీ చెక్‌పోస్టుల్లో పన్ను వసూళ్లు ప్రారంభం వార్తలు
మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల వద్ద పన్ను వసూళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. మార్కెటింగ్ శాఖ ఆదేశాలతో చెక్‌పోస్టులు తెరుచుకున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేస్తున్నవారి నుంచి ఒక శాతం మార్కెట్ రుసుము వసూలు చేయనున్నారు.
వ్యవసాయ కమిటీ చెక్‌పోస్టుల్లో పన్ను వసూళ్లు ప్రారంభం