గుంటూరు జిల్లా పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. జిల్లాలో ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. కరోనా నెగటివ్ అని తేలినా కుటుంబ సభ్యులెవరూ అతడి మృతదేహాన్ని ఖననం చేయడానికి ముందుకు రాలేదు.
చివరకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు. ఇద్దరు సిబ్బంది ఇంట్లో నుంచి మృతదేహాన్ని తరలించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.