సభాపతి ప్రధానోపాధ్యాయుడు లాంటి వాడని... పాఠశాలలో విద్యార్థులు అల్లరి చేసినప్పుడు బెత్తానికి పని చెపుతాడని....నేను అదే పని చేశానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్ క్లబ్‌ను స్పీకర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు స్తంభాలకంటే పెద్దదైంది పౌర వ్యవస్థ అని చెప్పారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలను ప్రజలు నిత్యం గమనిస్తున్నారని...వారికి సమయం వచ్చినప్పుడు గట్టిగా సమాధానం చెబుతున్నారని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. విశ్వసనీయత కాపాడుకున్నపుడే పత్రికలు రాణిస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతంలోనే ఉన్నారని...పార్టీ కార్యాలయం ఈ మండలంలోనే ఉందని భవిష్యత్ లో తాడేపల్లి మహా నగరంగా మారబోతోందని చెప్పారు.
'నాలుగు స్తంభాలకంటే పెద్దది.. పౌర వ్యవస్థ' - గుంటూరు జిల్లా
తాడేపల్లి ప్రెస్ క్లబ్‌ను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వసనీయత కాపాడుకున్నపుడే పత్రికలు రాణిస్తాయన్నారు.
inguaration prees building by speaker thammineni seethram in thadepalli guntur district