ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో స్వాతంత్య్ర దినోత్సవం - independence day celebration

గుంటూరు పోలీసు కవాతు మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మువ్వన్నల జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రసంగించారు.

independence day celebrations in guntur dst pared ground
independence day celebrations in guntur dst pared ground

By

Published : Aug 15, 2020, 3:49 PM IST

74వ స్వాతంత్య్ర వేడుకలు గుంటూరు పోలీసు కవాతు మైదానంలో ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా ఇంచార్జీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు జాతీయ జెండాను ఎగురవేసి, జెండా వందనం చేశారు.

అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి, జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి 2.93 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను గుర్తించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details