ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం - గుంటూరు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు న్యూస్

గుంటూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్నీ సిద్ధం చేసినట్లు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం వివరించారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్​రాజు పాల్గొననున్నట్లు తెలిపారు.

independence day arrangements
గుంటూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం

By

Published : Aug 14, 2020, 11:10 PM IST

గుంటూరు పోలీసు కవాతు మైదానంలో రేపు నిర్వహించే 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాటు చేసినట్లు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం తెలిపారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అయన వివరించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్​రాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details