ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.. ఎందుకంటే.. - నేరం

మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని తల్లి తలపై బండతో బాది చంపాడో కసాయి కొడుకు. దారుణమైన ఈ ఘటన గుంటూరు జిల్లా దావులూరు గ్రామంలో జరిగింది.

Murder
హత్య

By

Published : Jun 30, 2021, 10:58 PM IST

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో పచ్చడిబండతో తల బద్దలు కొట్టి తల్లిని చంపాడో కసాయి కొడుకు.

దావులూరు గ్రామానికి చెందిన కొరగంటి శ్యాంసుందర్ అనే వ్యక్తి కొన్ని ఏళ్లుగా భార్యతో విడిపోయి తల్లితోనే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అతను తాగుడుకు బానిసైయ్యాడు.

మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లితో వివాదం పెట్టుకున్నాడు. ఆ వివాదం కాస్త కొట్లాటకు తావు తీసింది. తాగిన మైకంలో తల్లి రాజ్యం (60) తలపై పచ్చడిబండతో బలంగా కొట్టాడు. దాంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ బలరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రేమ వేధింపులు: ఆత్మహత్యకు యత్నించిన బాలిక మృతి

ABOUT THE AUTHOR

...view details