ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు విజ్ఞాన్ వర్శిటీ స్నాతకోత్సవం - గుంటూరు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం

గుంటూరు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న నిర్వహించునున్నట్లు ఉపకులపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముగ్గురు ముఖ్యఅతిథిలు వస్తున్నట్లు వెల్లడించారు.

మీడియాసమావేెశంలో మాట్లాడుతున్న ఉపకులపతి

By

Published : Jul 26, 2019, 4:08 AM IST

మీడియాసమావేెశంలో మాట్లాడుతున్న ఉపకులపతి

ఈ నెల 27న విజ్ఞాన్ యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎం.వైస్. ప్రసాద్ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... 27న జరిగే స్నాతకోత్సవానికి మాజీ ఏడీఈ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కోట హరినారాయణ , మాస్ట్రో అఫ్ ఇండియన్ మ్యూజిక్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇయళయరాజా , కార్డియో సర్జన్ డాక్టర్ గోపాల్ కృష్ణ గోఖలే , టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి. రాజన్న ముఖ్యతిధులుగా హాజరవుతారని వెల్లడించారు. స్నాతకోత్సవం సందర్భంగా తమ యానివర్సిటీకి 1569 విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేయనున్నట్లు , గత ఏడాదిలో డిగ్రీలు పూర్తి చేసుకుని అత్యుత్తమ ఫలితాలు చూపిన 22 మందికి బంగారు పతకాలు మరో 18 మందికి ప్రత్యేక పతకాలు అందజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో స్నాతకోత్సవం ప్రధాన అనుసంధాన కర్త డాక్టర్ పీ.ఎం.వి.రావు , విజ్ఞాన్ విద్యాసంస్థల ఛాన్సలర్ కె. రామమూర్తి , రిజిస్ట్రార్ డాక్టర్ ఏఎం.ఎస్.రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details