గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డులో జమ్ములపాలెం ఫ్లైఓవర్ వంతెన వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. దీనిని నివారించేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ చర్యలు చేపట్టారు.ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి నడుంబిగించారు. ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఆక్రమణలను తొలగించారు. పట్టణంలోని అన్నీ ప్రధాన రహదారుల్లో అక్రమాలు తొలగింపు కార్యక్రమం ప్రారంభించామని మునిసిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.
పెరిగిన ట్రాఫిక్కు తొలగిన అక్రమణలు - బాపట్ల పోలీసులు
ట్రాఫిక్ సమస్య నివారించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు.
రోడ్డుపై అక్రమాలను తొలగిస్తున్న పోలీసులు బృందం