ఎపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం: తమ్మారెడ్డి - guntur
వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంపీఈవోలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరులోని పోలీస్ కల్యాణ మండపంలో ఎంపీఈవోల దీక్షను ఆయన విరమింపజేశారు.
గుంటూరులోని పోలీస్ కల్యాణ మండపంలో ఎంపీఈవోలు నిర్వహించిన కార్యాక్రమానికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి హాజరయ్యారు. కాంట్రాక్టు ఎంపీఈవోల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీఈవోలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. ముఖ్యమంత్రి జగన్ సమస్య ఉంటే తప్పించుకునే వ్యక్తి కాదని, నేరుగా సమస్య గురించి అడిగి తెలుసుకుని పరిష్కరించే వ్యక్తని తెలిపారు. వైకాపా పాలనలో ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్నం పెట్టడమే తప్ప అన్నం తీసే ప్రభుత్వం కాదన్నారు. ఉమ్మారెడ్డి హామీతో దీక్షను విరమణ చేస్తున్నామని...ఎంపీఈవో లకు తాము ఎప్పుడు బాసటగా ఉంటామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపీఈఓలతో మాట్లాడిన అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
ఇది చూడండి: విచిత్ర బౌలింగ్ యాక్షన్.. నెట్టింట వైరల్