ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి డివిజన్​లో వరద ప్రభావం... అప్రమత్తమైన జిల్లా యంత్రాగం - లంక గ్రామాల్లో ఎమ్మల్యే అన్నాబత్తుని శివకుమార్ పర్యటన

ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు భారీగా నీటి విడుదల కొనసాగుతున్నందున గుంటూరు జిల్లా యంత్రాగం అప్రమత్తం అయింది. తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలోని వరద ప్రభావం ఉండటం వల్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు.

impact of floods on lanka villages of tenali division in guntur district
తెనాలి డివిజన్​లో వరద ప్రభావం... అప్రమత్తమైన జిల్లా యంత్రాగం

By

Published : Sep 28, 2020, 8:24 PM IST

ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున ప్రకాశం బ్యారేజి నుంచి 6 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిన దిగువకు విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలోని కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో వరద ప్రభావం కనిపిస్తోంది. అక్కడ ఉన్న లంక గ్రామాల్లో పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపోలాలు నీటమనిగాయి. ఉదయం నుంచి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నందున అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. సహయక చర్యలు ముమ్మరం చేసింది.

ఎమ్మెల్యే పర్యటన..

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పర్యటించారు. బొమ్మవాని పాలెం, అన్నవరపు లంకల్లో పర్యటింటిన శివకుమార్.... అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

ఇదీ చూడండి:

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద... లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details