ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉండవల్లి వద్ద వలస కూలీల అడ్డగింత - migrant workers in ap

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కాలినడకను ఆశ్రయించారు. వీరిని గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Immigration of migrant laborers stopped in undavalli gunturu district
ఉండవల్లి వద్ద వలస కూలీల అడ్డగింత

By

Published : May 7, 2020, 2:59 PM IST

అమరావతి నుంచి ఒడిశాకు కాలినడకన వెళ్తున్న సుమారు 70 మంది వలస కార్మికులను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు బుధవారం అర్థరాత్రి స్వరాష్ట్రానికి బయలుదేరారు.

మార్గమధ్యంలో ఆపేసిన పోలీసులు... ఎలాంటి అనుమతులు లేవంటూ ముందుకు పంపేందుకు నిరాకరించారు. ఈ కారణంగా.. వారు రహదారిపైనే ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details