జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల అధికారాల్ని సంయుక్త కలెక్టర్లకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 64ను ఉపసంహరించుకోవాలని.. ఐఎంఏ రాష్ట్ర విభాగం కార్యదర్శి డాక్టర్ నందకిషోర్ డిమాండ్ చేశారు. పాతికేళ్లకుపైగా వైద్య సేవల్లో ఉన్న వారికే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులుగా గుర్తింపు వస్తుందని, ఆరోగ్యపరమైన అంశాలపై వారికి లోతైన అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. జేసీలకు పని కల్పించటం కోసం డీఎంహెచ్వోల స్థాయి తగ్గించటం సరికాదని అభిప్రాయపడ్డారు. జీవోను ఉపసంహరించుకోకుంటే డాక్టర్స్ డే వేడుకలు బహిష్కరిస్తామని వెల్లడించారు.
'జేసీల కోసం డీఎంహెచ్వోల స్థాయి తగ్గించడం సరికాదు' - IMA state secretary dr.nandhakishore fire on government
జేసీలకు డీఎంహెచ్వో అధికారుల అధికారాల్ని కట్టబెట్టడాన్ని ఐఎంఏ రాష్ట్ర విభాగం కార్యదర్శి డా. నందకిషోర్ డిమాండ్ చేశారు. సంయుక్త కలెక్టర్లకు పని కల్పించడం కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల స్థాయిని తగ్గించడం సరికాదని పేర్కొన్నారు.
ఐఎంఏ రాష్ట్ర విభాగం కార్యదర్శి డా.నందకిషోర్