ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన - Narasaraopet Latest News

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ వైద్యులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనుసరిస్తున్న వైఖరిని వైద్యులు ఖండించారు.

IMA-led protest at Narasaraopet Government Hospital
నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన

By

Published : Dec 8, 2020, 5:45 PM IST

నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన

కేంద్ర ప్రభుత్వం నూతనంగా హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతులు ఇవ్వడాన్ని ఐఎంఏ వైద్యులు తప్పుపట్టారు. అనుభవం తక్కువగా ఉన్న హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశం ఇస్తే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం అవుతుందని వైద్యులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశాన్ని తక్షణమే రద్దు చేయాలని నరసరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రభుత్వ వైద్యులు నిరసన ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details