అధికార పార్టీకి చెందిన నాయకుడు గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెంలో పొలాల వద్ద మట్టిని తవ్వి లారీల్లో అక్రమంగా తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు.
అక్రమంగా మట్టి తరలింపు.. అడ్డుకున్న గ్రామస్థులు - kakumanu latest news
గుంటూరు జిల్లా కాకుమాను మండలం బీకేపాలెంలో వైకాపా నాయకుడు పొలాల వద్ద డొంకలను తవ్వి అక్రమంగా లారీల్లో మట్టిని తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. 30 అడుగుల మేర తవ్వితే తాము పొలాలకు ఎలా వెళ్లాలని వారు ప్రశ్నించారు.
బీకే పాలెంలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న స్థానికులు
పెదనందిపాడు మండలానికి చెందిన వైకాపా నాయకుడు కాకుమాను మండలంలోని పొలాల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రి తవ్వించి లారీల్లో తరలిస్తున్నాడు. శీతల గిడ్డంగి నిర్మాణం కోసం ఈ మట్టిని తరలిస్తుండగా.. విషయం తెలుసుకున్న రైతులు గ్రామంలో నుంచి మట్టి తీసుకెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. తమ పొలాలకు వెళ్లే డొంకలను తవ్వి మట్టి తీసుకెళ్లడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్