ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా, గుంటూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు.. తెలంగాణ మద్యం పట్టివేత - jonnalagadda telangna liquor cought news

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తోన్న తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

telangana liquor cought
కృష్ణా, గుంటూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

By

Published : Apr 13, 2021, 5:25 PM IST

Updated : Apr 13, 2021, 9:42 PM IST

కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ గ్రామం వద్ద పోలీసులు ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా.. విజయవాడకు చెందిన యశోదరావు అనే వ్యక్తి వద్ద తెలంగాణ మద్యం లభ్యమైంది. మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా అసండ్రతండా సమీపంలో వాహనంలో తరలిస్తున్న 1008 బాటిళ్ల తెలంగాణా మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. మద్యం బాటిళ్ల విలువ రెండు లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. పెదకూరపాడుకు చెందిన ఒక వ్యక్తి ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన క్రేన్​.. ఇద్దరు మృతి​

Last Updated : Apr 13, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details