గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత గోవిందపురం రేవు సమీపంలో ఓ వ్యక్తి వద్ద 345 మద్యం సీసాలు పట్టుబడ్డాయని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాటి విలువ రూ.52,000/- రూపాయల వరకు ఉంటుందని ఎస్సై రాజా నాయక్ తెలిపారు.
అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత.. ఒకరిపై కేసు నమోదు - మాచరవంలో అక్రమ మద్యం పట్టివేత
గుంటూరు జిల్లా మాచవరంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ రవాణా, విక్రయం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
![అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత.. ఒకరిపై కేసు నమోదు illicit liquor cought](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11716017-723-11716017-1620707219216.jpg)
మాచవరంలో అక్రమ మద్యం పట్టివేత