Cigarettes Smuggling: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లను గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి లారీలో సిగరెట్లు తరలిస్తున్నారన్న సమాచారంతో.. కాజా టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ కంటైనర్లో సుమారు కోటి రూపాయల విలువైన సిగరెట్ ప్యాకెట్లను గుర్తించారు. సిగరెట్లు తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు లెక్కిస్తున్నారు. గోల్డ్ విమల్, గోల్డ్ క్వీన్ పేరుతో సుమారు 100 బస్తాలలో సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
లారీ కంటైనర్ నిండా సిగరెట్ల రవాణా.. 100 బస్తాల్లో సిగరెట్లు.. - Police Seized Cigarettes
Cigarettes: అక్రమ రవాణాలపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన.. పోలీసుల నుంచి తప్పించుకుని మరి కేటుగాళ్లు అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. ఇలానే పోలీసుల కళ్లుకప్పి సిగరెట్లను అక్రమంగా కంటైనర్ లారీలో తరలిస్తుండగా పోలీసు తనిఖీలలో పట్టుబడ్డారు. ఇంతకీ ఇది ఎక్కడంటే..
సిగరెట్ల అక్రమ రవాణా