గుంటూరు జిల్లా చెరుకుపల్లి నుంచి నెల్లూరుకి లారీలో అక్రమంగా తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని... బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో... తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు వివరించారు. బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని అన్నారు.
28 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - illegal ration rice
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల వద్ద జరిగింది. రేషన్ బియ్యాన్ని నెల్లూరుకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
28 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత