చిలకలూరిపేట అర్బన్ సీఐ టి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు... తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని ప్రణాళిక ప్రకారం పట్టుకున్నారు. పట్టణంలోని సుగాలి కాలనీకి చెందిన మెట్టు నాగేశ్వరరావు అనే వ్యక్తి... పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి మహీంద్ర వాహనంలో భారీగా మద్యం తరలిస్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనం నుంచి 816 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తెలంగాణ మద్యం తరలిస్తున్న వాహనం పట్టివేత
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. వాహనంలోని 816 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ముందస్తు ప్రణాళికతో మద్యం తరలిస్తున్న వాహనం పట్టివేత