ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు - చర్యలు తీసుకోవలని ప్రతిపక్షాల డిమాండ్​ - AP Latest News

Illegal Votes of YCP Government : రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల అవకతవకలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దొంగ ఓట్లు, జాబితా సవరణపై పరిశీలకులు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల జాబితాను పూర్తిస్థాయిలో పారదర్శకంగా రూపొందించాలని విపక్ష నేతలు.. ఎన్నికల పరిశీలకులను కోరుతున్నారు.

Illegal_Votes_of_YCP_Government
Illegal_Votes_of_YCP_Government

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 9:12 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు - చర్యలు తీసుకోవలన్న విపక్షాల నేతలు

Illegal Votes of YCP Government : ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నిల పరిశీలకుడు మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌ గౌతమి.. ఇరుపార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం సచివాలయంలో కూర్చోని ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని కోరగా.. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.

ఒకే ఇల్లు.. ఆరుగురు ఉంటే 48 ఓట్లు.. తప్పులతడకగా ఓటరు జాబితా

YCP Fake Votes in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలోని ఓటర్ల జాబితాల్లో ఇంకా అవకతవకలు ఉన్నాయని.. ఓటరు జాబితా పరిశీలకుడుగా వచ్చిన ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె. శ్యామలరావు దృష్టికి రాజకీయ పార్టీలనేతలు తీసుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు.. కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జేసీ నవీన్ కుమార్​కు వివరించారు. జిల్లాలో డూప్లికేట్, డబుల్ ఎంట్రీ, మరణించిన వారి ఓట్లు ఉన్నాయని.. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తొలగించలేదని మండిపడ్డారు. అలాగే ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.

టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్రలు - మౌనం వహించిన ఎన్నికల సంఘం!

Fake Votes in Tirupati District: తిరుపతి జిల్లాలో దొంగ ఓట్లను తొలగించటంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో దొంగ ఓట్లపై కలెక్టర్‍ వెంకటరమణారెడ్డికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు కలెక్టర్​ను కలిసి ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమాల గురించి వివరించారు. ఓటర్ల జాబితాలోని దొంగ ఓట్లు, మృతి చెందిన వారు.. వంటి అవకతవకల ఓట్లను తొలగించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో అక్రమాల సిత్రాలు- సమగ్ర పరిశీలన తర్వాత కూడా తప్పులతడకగా ఓటర్ల జాబితా

List of Fake Votes in AP :అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితాలో 70 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని అధికారులకు తెలిపారు. దొంగఓట్లను తొలగించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా తొలగించలేదని ఆరోపించారు. తుది జాబితా సిద్ధమవుతున్న నేపథ్యంలో దొంగఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఓటర్ల జాబితాలోని అవకతవకలపై జాతీయ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమకు న్యాయం జరిగే వరరకు దొంగ ఓట్లపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

అధేవిధంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల వైసీపీ నేత ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకుల మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. అధికారుల తీరు ఇలానే ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు. ఫిర్యాదుపై చర్చించి విచారణ చేస్తామని అధికారి హామీ ఇచ్చారు.

Fake Votes in Vijayawada: ఒకే ఇల్లు.. ఆరుగురు ఉంటే 48 ఓట్లు.. తప్పులతడకగా ఓటరు జాబితా

ABOUT THE AUTHOR

...view details