గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గింజుపల్లి వద్ద.. అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. కృష్ణా నదిలో పడవ ద్వారా తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. తెలంగాణలోని మల్లారెడ్డి గూడెం నుంచి అచ్చంపేటకు వస్తున్న 744 సీసాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎనిమిది మందితో పాటు పడవ, ఆటో, ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పడవలో తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత - గుంటూరులో కృష్ణానదిపై తరలిస్తున్న మద్యం స్వాధీనం
అక్రమ వ్యాపారులు ఏ దారినీ వదలడం లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేటకు మద్యాన్ని తరలించడానికి కొత్త మార్గాన్ని కనిపెట్టారు. కృష్ణా నది ద్వారా పడవలో గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. సరుకు స్వాధీనం చేసుకున్నారు.
![పడవలో తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత telangana liquor caught in achampeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9459231-344-9459231-1604682931360.jpg)
పోలీసులు పట్టుకున్న మద్యం సీసాలు