ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - రేషన్ బియ్యం పట్టివేత వార్తలు

గుంటూరు జిల్లా మేడికొండూరులో ఎలాంటి అనుమతులు లేకుండా... 4 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పేరేచర్ల జంక్షన్​లో వాహనాలు తనీఖీ చేస్తుండగా... పేరేచర్ల నుంచి నరసరావుపేట వైపు వెళుతున్న ఆటోను గుర్తించారు. అందులో తరలిస్తున్న 80బస్తాల బియ్యంతో పాటు.. ఆటోను సైతం స్వాధీనం చేసుకున్నారు.

illegal transport of ration has seized at guntur district
అక్రమంగా తరలిస్తున్న 4టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Nov 23, 2020, 7:10 AM IST


ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల రేషన్ బియ్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేరేచర్ల జంక్షన్​లో వాహనాలు తనీఖీ చేస్తుండగా... నరసరావుపేట వైపు వెళుతున్న ఆటోను గుర్తించారు. 80 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వేములూరిపాడుకు చెందిన పచాల సుందరరావు, ఫిరంగిపురం గ్రామానికి చెందిన భాను ప్రసాద్ పై కేసు నమోదు చేసినట్లు మేడికొండూరు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details