రాష్ట్రంలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం, కరోనా కారణంగా కంటైన్మెంట్ జోన్లలో అందుబాటులో లేకపోవడంతో... అక్రమ మద్యం అమ్మకాలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ నుంచి ఏపీకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మారిశెట్టి రామాంజనేయులు... తన స్నేహితులతో కలిసి అక్రమ మద్యం వ్యాపారానికి అలవాటుపడ్డారు. నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్లకు వెళ్లి... మినీ లారీ నిండుగా మద్యం సీసాలు తీసుకువచ్చి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ క్రమంలో చిలకలూరిపేట కోటప్పకొండ మార్గంలోని పోతవరం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్రమం మద్యం రవాణా వ్యవహారం బయటపడింది. మొత్తం రూ 2.45 లక్షల విలువచేసే 1971 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని.. మినీ లారీని సీజ్ చేశారు. వాహన డ్రైవర్ తో పాటు మద్యం అక్రమానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఇంఛార్జ్ సీఐ కరుణాకర్, ఎస్సై భాస్కర్లు తెలిపారు.
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - guntur latest news
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తరలిస్తున్న రూ.2.45 లక్షల విలువగల 1971 మద్యం సీసాలను సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం