ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపల్లె తీర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు - రేపల్లె తీర ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు

గుంటూరు జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పొలాల్లో మట్టి తవ్వడమే కాకుండా ఆర్​ఎం డ్రైన్లపై కూడా అక్రమార్కుల కన్నుపడింది. నగరం సమీపంలోని కారంకి వారిపాలెం వెళ్లే మార్గంలో ఉన్న ఆర్​ఎం డ్రైన్​లో మట్టి తవ్వకాలు చెయ్యడమే ఇందుకు నిదర్శనం.

Arbitrary soil excavations in the coastal areas of Repalle
రేపల్లె తీర ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు

By

Published : Jun 13, 2021, 10:18 PM IST

ఇళ్ల ప్లాట్ల మెరకలు పూడ్చే నెపంతో గుంటూరు జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు నిర్భయంగా పట్టపగలే జరుగుతున్నాయి. జేసీబీలు పెట్టి మరీ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి తవ్విన మట్టిని పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరం సమీపంలోని కారంకి వారిపాలెం వెళ్లే మార్గంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పట్టపగలు ఆర్​ఎం డ్రైన్​లో మట్టి తవ్వకాలు జరుగుతున్నా..రెవిన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు చూసి చూడనట్లు వదిలేయడం పట్ల స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ వర్షాలు కురిస్తే..
డ్రైన్​లో మేటవేసిన మెరక ప్రాంతాన్ని తవ్వితే లోతు ఏర్పడుతుందని.. అక్రమంలో అందులో దిగిన పశువులు, మనుషుల ప్రాణాలకే ప్రమాదమని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే పలుచోట్ల కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయని.. భారీ వర్షాలు కురిస్తే గండి కొట్టి పంట పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

స్థానిక చోట నాయకుల అండతోనే ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోని అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఇదీ చదవండి..

ASHOK BABU: '5' పీఆర్సీలు పెండింగ్​లో పెడితే ఎలా..? సీఎం సార్​

ABOUT THE AUTHOR

...view details