రాజస్థాన్‌కు చెందిన ఆయుధంరాయ్ విజయవాడలోని మన్ మందిర్ వెండి ఆభరణాల దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దుకాణ యజమాని ముఖేష్ 474 వెండి పట్టీలను ఇచ్చి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించాలని చెప్పగా.. ఆయుధంరాయ్ వాటిని తీసుకొని వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. రాజీవ్ కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని అతని వద్ద ఉన్న వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు.
ఓ వ్యక్తి నుంచి.. 31 కిలోల వెండి స్వాధీనం - గుంటూరులో అక్రమంగా తరలిస్తున్న వెండి పట్టివేత వార్తలు
గుంటూరు జిల్లా మంగళగిరి రాజీవ్ కూడలిలో ఓ వ్యక్తి వద్ద అక్రమంగా ఉన్న 31 కిలోల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి యజమాని వెండి పట్టీలు అమ్మడానికి పంపించినట్లు గుర్తించారు.
మంగళగిరిలో ఓ వ్యక్తి వద్ద 31 కిలోల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు