గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కోటయ్య ఇంటి వద్ద నిల్వ చేసిన 400 బస్తాల అక్రమ బియ్యాన్ని.. లారీలో లోడ్ చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
డ్రైవర్ శంషాద్ ఖాన్ అదుపులోకి తీసుకున్నారు. పొన్నూరుకు చెందిన వ్యక్తి చుట్టు పక్కల గ్రామాల్లో రేషన్ దుకాణాల నుంచి బియ్యం సేకరించి.. ఇక్కడ నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం అందిందని.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.