ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత...8 మంది అరెస్టు - గుంటూరులో అక్రమ మద్యం పట్టివేత

అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను గుంటూరు జిల్లా దమ్మాలపాడులో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీలో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అక్రమ మద్యం పట్టివేత...8 మంది అరెస్టు
అక్రమ మద్యం పట్టివేత...8 మంది అరెస్టు

By

Published : Nov 20, 2020, 10:42 PM IST

గుంటూరు జిల్లా దమ్మాలపాడులో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిందితల వద్ద నుంచి 116 మద్యం బాటిల్స్ , రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 4 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీలో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులు జిల్లాలోని నకరికల్లు, దమ్మలపాడు, రొంపిచర్ల , నరసింగపాడు, పమిడిపాడు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details