తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో మద్యం పట్టుబడినట్లు చెప్పారు. వరిపొట్టు బస్తాలతో వెళుతున్న డీసీఎం వాహనాన్ని పరిశీలించగా అందులో 284 మద్యం బాక్సులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటి విలువ సుమారుగా రూ.25 లక్షలు ఉంటుందని దాచేపల్లి ఎస్సై బాల నాగిరెడ్డి చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
రూ. 25 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - pondugula checkpost latest news
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం