ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జమ్మలమడకలో 300 లీటర్ల నాటుసారా స్వాధీనం - మాచర్లతో 300 లీటర్ల స్వాధీనం

గుంటూరు జిల్లా జమ్మలమడక వినాయకుని గుట్టలోని ఓ ఇంట్లో నిల్వచేసిన నాటుసారాను ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. 15 క్యాన్లలో సుమారు 300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేశారు.

Illegal liquor
Illegal liquor

By

Published : Nov 16, 2020, 10:58 PM IST

గుంటూరు జిల్లా జమ్మలమడకలోని ఓ ఇంట్లో దాచిన నాటుసారాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మాచర్ల ప్రొహిబిషన్, ఎక్సైజ్(ఎస్ఈబీ) పరిధిలోని సిబ్బంది జమ్మలమడక రహదారిలోని వినాయకుని గుట్ట ప్రాంతంలో బత్తుల గురవయ్య అనే వ్యక్తి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఇంట్లో 15 క్యాన్లలో 300 లీటర్ల నాటుసారాను గుర్తించారు. సారాతో పాటు ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details