ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న మట్టితవ్వకాలు

గుంటూరు జిల్లాలో మట్టితవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు నగరానికి అతి సమీపంలోనే ఈ తవ్వకాల తంతు జరుగుతోంది. అధికారులు మాత్రం తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు.

Illegal gravel mining in obulnaidupalem guntur district
గుంటూరు జిల్లాలో మట్టితవ్వకాలు

By

Published : Jul 1, 2021, 7:49 PM IST

గుంటూరు గ్రామీణ మండలం ఓబులనాయుడుపాలెంలో నాణ్యమైన గ్రావెల్ ఉండటంతో మైనింగ్ కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. భూగర్భ గనుల శాఖ అనుమతులు ఉంటేనే తవ్వకాలు జరపాలి. కానీ అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగుతున్నాయి. పగలైతే ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో రాత్రి సమయంలో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని ప్రైవేటు వెంచర్లకు అమ్ముకుంటున్నారు. జేసీబీల సాయంతో మట్టి తవ్వటం, భారీ వాహనాల సాయంతో తరలించటం యథేచ్ఛగా జరుగుతోంది. ఈటీవీ భారత్-ఈనాడు ప్రతినిధులు అక్కడకు వెళ్లగానే టిప్పర్లు, ట్రాక్టర్లు అక్కడి నుంచి హడావుడిగా తరలించేశారు.

Illegal gravel mining in obulnaidupalem guntur district

గనులశాఖ అధికారులు గతంలో ఇచ్చిన లీజుల గడువు ముగిసినా కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ ప్రాంతంలోనే ప్రైవేటు వ్యక్తుల భూములూ ఉన్నాయి. తమ భూముల్లో తవ్వుతారనే ఉద్దేశంతో వారు కంచె వేసుకున్నారు. మరికొందరు ప్రహరీ కట్టుకున్నారు. ప్రైవేటు భూముల సరిహద్దుల వరకూ తవ్వకాలు జరిగాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. సాధారణంగా 6మీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్వటానికి నిబంధనలు అనుమతించవు. కానీ ఇక్కడ 10మీటర్లకు పైగా తవ్వకాలు జరిగాయి. మరికొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ లోతులో తవ్వారు. భారీ స్థాయిలో ఏర్పడిన గుంతలే ఇందుకు నిదర్శనం. ఇటీవల వర్షాలకు ఈ గుంతల్లోకి నీరు వచ్చి చేరింది.

ఓబులనాయుడుపాలెంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవన్న గనులశాఖ సహాయ సంచాలకుడు విష్ణువర్థన్ రావు... కొందరు దరఖాస్తు చేసుకున్నాఇంకా అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గతంలో లీజుకు తీసుకున్న ఒకరికి మాత్రం మరికొంత పరిమాణంలో మట్టి తవ్వుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు.

ఇవీచదవండి.

Missing : విశాఖలో ముగ్గురు యువతులు మిస్సింగ్... పోలీసుల దర్యాప్తు

MAA Elections: ప్రకాశ్​రాజ్​కు ఆ స్టార్​ నటుడు మద్దతు!

ABOUT THE AUTHOR

...view details