తెనాలి పురపాలిక ఎన్నికల్లో నాలుగోవార్డు నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ప్రవేశించారు. మద్యం సీసాలను వాటర్ ట్యాంక్ వద్ద ఉంచి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదైంది. ఉదయం అబ్కారీ అధికారులు తెలుగుదేశం అభ్యర్థి ఇంటికి వెళ్లారు. వాటర్ ట్యాంకు ఎక్కడ? ఎన్నో ఫ్లోర్ అంటూ ఆరా తీశారు. కాసేపు హడావుడి చేసిన అబ్కారీ సిబ్బంది.. పైఅంతస్తలోని పెంట్‌హౌస్‌లో ఉంటున్న తెదేపా అభ్యర్థి బంధువు తాళ్లూరి కార్తీక్‌ను తీసుకెళ్లారు. అధికారుల తీరుపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలోని వ్యక్తులను గుర్తించకుండా తమను బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలంటూ సీసీ కెమెరా దృశ్యాలను తెదేపా విడుదల చేసింది.
వైకాపా చీకటి రాజకీయం... సీసీ కెమెరాల్లో...
పురపాలక ఎన్నికల్లో విజయం సాధించడానికి తెనాలిలో అధికార పార్టీ శ్రేణులు అడ్డదారులు తొక్కుతున్నాయంటూ తెదేపా ఆరోపించింది. సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది.
illegal case on tdp leaders in tenali
Last Updated : Mar 13, 2020, 2:12 PM IST