గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందాపురంలో రూ.5లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు పాల క్యాన్లలో మద్యాన్ని తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు మార్గమధ్యంలో తనిఖీ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారయ్యారు. తెలంగాణలో ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత - lockdown in guntur
గుంటూరు జిల్లాలో తెలంగాణ నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.5లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత