Illegal activities at anna canteen: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని అన్న క్యాంటీన్ భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. రూ.5కే పేదల కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారాక వాటిని మూసేశారు. చాలాచోట్ల ఆ భవనాలను గ్రామ సచివాలయాలుగా వాడుకుంటున్నారు. వదిలేసిన కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉండవల్లి కేంద్రంలో మద్యం తాగి ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. క్యాంటీన్ లోపల, ఆవరణలో తాగి పడేసిన మద్యం సీసాలే కనిపిస్తున్నాయి.
అన్నం పెట్టిన కేంద్రంలో అసాంఘిక పనులు - ఉండవల్లిలోని అన్న క్యాంటీన్లో అసాంఘిక కార్యకలాపాలు
Illegal activities at anna canteen: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని అన్న క్యాంటీన్ భవనం.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఉండవల్లి కేంద్రంలో మద్యం తాగి ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. క్యాంటీన్ లోపల, ఆవరణలో తాగి పడేసిన మద్యం సీసాలే కనిపిస్తున్నాయి.
అన్నం పెట్టిన కేంద్రంలో అసాంఘిక పనులు
TAGGED:
ap latest news