ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోషకాహారలోపం నివారణ'కు ప్రత్యేక ప్రణాళిక!

జీవనోపాధి కోసం వలస వెళ్లే మహిళలు, చిన్నారుల కోసం అంగన్ వాడీ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రంలో వారు ఏ ప్రాంతంలో ఉన్నా.. పోషకాహారం అందించేదిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

By

Published : May 29, 2019, 7:52 PM IST

అంగన్​వాడీలో చిన్నారులు(ఫైల్)

వివరాలు వెల్లడిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్

పోషకాహార లోపం, రక్తహీనత నివారణే లక్ష్యంగా ఐసీడీఎస్ అధికారులు, అంగన్​వాడీలు పని చేయాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ సూచించారు. గుంటూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవోలతో సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసినందున అభివృద్ధి పనులను త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్​ఐడీఎఫ్ 23 కింద మంజూరైన అంగన్​వాడీ భవన నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ జీవనోపాధి కోసం వలస వచ్చిన గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారుల వివరాలను నమోదు చేసుకొని పోషకాహారాన్ని అందజేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జూన్ నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. మెప్మా సిబ్బంది సహకారంతో సర్వీస్ ప్రొవైడర్ ద్వారా సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. అంగన్​వాడీ కేంద్రాల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీపై కలెక్టర్​తో మాట్లాడి ప్రకటన విడుదల చేయాల్సి ఉందన్నారు. చిన్నారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను ఎక్కువమంది ఉన్న ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను ఇచ్చారని అరుణ్ కుమార్ వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details