ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీ - ఐఏఎస్​ అధికారుల బదిలీలు, నియామకాలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఐఏఎస్​ల నియామకాలు, బదిలీలు

By

Published : Sep 16, 2019, 7:26 PM IST

Updated : Sep 16, 2019, 7:52 PM IST

రాష్ట్రంలో పలువురు అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
  • ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్​ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్​)గా ప్రవీణ్ ప్రకాశ్​కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు.
  • విజయనగరం జిల్లా పార్వతీపురం ITDA ప్రాజెక్టు డైరెక్టర్​ డాక్టర్ వినోద్ కుమార్​ను విజయవాడ సబ్ కలెక్టర్​గా నియమించారు.
  • అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎండీ. ఇలియాజ్ రిజ్వి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
  • రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఎన్. ప్రతీప్ కుమార్​ను అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్​గా నియమితులయ్యారు.
Last Updated : Sep 16, 2019, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details