Hyderabad metro services stopped :హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. మియాపూర్-ఎల్బీ నగర్ మార్గంలో సేవలు సుమారు 30 నిమిషాలుగా నిలిచిపోయాయి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. దీంతో ఖైరతాబాద్, లక్డీకపూల్ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి.
రైళ్లు తిరిగి బయల్దేరేందుకు కాస్త సమయం పడుతుందని మెట్రో సిబ్బంది అనౌన్స్ చేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. టెక్నీషియన్లు వచ్చి మరమ్మతు చేయడంతో మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.