ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్​సీయూలో దారుణం.. విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం - హైదరాబాద్​ అత్యాచారాయత్న వార్తలు

HCU Professor Attempted To Rape Student: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్‌కు చెందిన ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవి రంజన్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొఫెసర్​ను సస్పెండ్ చేశారు.

Attempted To Rape
అత్యాచారాయత్నం

By

Published : Dec 3, 2022, 1:18 PM IST

Updated : Dec 3, 2022, 5:08 PM IST

HCU Professor Attempted To Rape Student: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. తనపై ఓ ప్రొఫెసర్ అత్యాచారానికి యత్నించాడని ఓ విద్యార్థిని గచ్చిబౌలి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. థాయిలాండ్​కు చెందిన విద్యార్థిని యూనివర్సిటీలో ఎంఏ హిందీ చదువుతుంది. నిన్న రాత్రి ఓ బుక్ ఇవ్వడానికి హిందీ ప్రొఫెసర్ రవి రంజన్​ పిలవడంతో బయటకు వచ్చింది.

ఈ క్రమంలోనే ప్రొఫెసర్ రవి రంజన్ ఆ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్ రవి రంజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడుపై 354 ఐపీసీ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మాదాపుర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. దీంతో ప్రొఫెసర్​ను అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ ఘటనపై విద్యార్థులు భగ్గుమన్నారు. సంబంధిత ప్రొఫెసర్​పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్శిటీ ముందు ధర్నాకు దిగారు. ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో సెంట్రల్‌ యూనివర్శిటీకి పోలీసులు అదనపు బలగాలను తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 3, 2022, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details