గుంటూరు జిల్లా తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో విద్యుదాఘాతం కారణంగా ఓ పూరిల్లు కాలిపోయింది. పూరింటిపైన ఉన్న విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి రాసుకుని నిప్పురవ్వలు చెలరేగిన కారణంగా.. మంటలు చెలరేగాయి. మంటలు ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ సైతం పేలింది. మంటలు చెలరేగడంతో ఇంటిలో ఉన్న వాళ్ళ అందరూ బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది.
ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 1.5 లక్షల నష్టం వాటిల్లిందని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.