ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భార్యపై.. స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం' - man raped wife with frriends in guntur

స్నేహితులతో కలిసి తనపై భర్తే.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ గుంటూరు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

husbend raped wife with friends
స్నేహితులతో కలిసి భర్త సామూహిక అత్యాచారం

By

Published : Dec 20, 2020, 10:34 AM IST

భర్త, అతని స్నేహితులతో కలిసి... తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ ఓ గృహిణి గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన మహిళతో బెంగళూరుకు చెందిన వ్యక్తికి ఏడేళ్ల కిందట వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య స్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. కొద్దిరోజుల కిందట అతను గుంటూరు వచ్చినట్లు తెలుసుకున్న సదరు మహిళ, బంధువులు వెళ్లి అతనితో మాట్లాడే క్రమంలో గొడవ జరిగింది.

భార్య, ఆమె తరఫు బంధువులు తనపై దాడిచేశారంటూ సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 17న సదరు మహిళ.. తన భర్త వద్దకు వెళ్లింది. కాపురానికి తీసుకువెళ్లాలని అడగాలనుకుంది. కానీ.. అక్కడ మద్యం తాగుతున్న భర్త, తన స్నేహితులతో కలిసి సామూహికంగా అత్యాచారం చేశారని ఫిర్యాదు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మల్లికార్జునరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details