ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''భగవంతుడా.... నాకు ఎందుకీ శిక్ష''? - SAD SITUATION IN GUNTUR DISTRICT

ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. వారి ఆనందాన్ని చూసి ఈర్ష్యపడింది. అనారోగ్యం రూపంలో పెద్ద కుమార్తెను మృత్యు ఒడికి చేర్చింది. పిల్లలే సర్వస్వం అనుకున్న తల్లిదండ్రులను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. వారినీ బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. చిన్న కుమార్తెను అనాథను చేసి రోడ్డున పడేసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన.. కంటతడి పెట్టిస్తోంది.

HUSBAND,WIFE SUCIDE IN GUNTUR DISTRICT
గుంటూరు జిల్లాలో దంపతుల ఆత్మహత్య

By

Published : Feb 12, 2020, 8:34 PM IST

గుంటూరు జిల్లాలో దంపతుల ఆత్మహత్య

తీవ్ర మనస్తాపంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో విషాదం నింపింది. చెరుకుపల్లికి చెందిన అన్నపరెడ్డి రాము (40), తిరుపతమ్మ (35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రెండు నెలల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందింది. చిన్న కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. పెద్ద కుమార్తె ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఎంతకూ కోలుకోలేకపోయారు. చివరికి ఫ్యాన్​కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

మిన్నంటిన రోదనలు...

రెండు నెలల వ్యవధిలోనే సోదరి, తల్లిదండ్రుల మృతితో చిన్న కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది. తనను అనాథను చేసి వెళ్లిపోయారంటూ రోదించిన ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఈ విషాద ఘటన గ్రామంలో అందరినీ కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:

కోర్టుకు హాజరు కావాలని డీజీపీ సవాంగ్​కు హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details