ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విడాకులు ఇవ్వలేదన్న కోపంతో... భార్యపై కత్తితో దాడి! - nagara palem police latest news

విడాకులు ఇవ్వడం లేదనే కోపంతో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. గమనించిన స్థానికులు ఆమెను స్థానికి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Husband stabs wife for not giving divorcing
భార్యపై భర్త కత్తితో దాడి

By

Published : May 1, 2021, 3:55 PM IST

విడాకులు అడిగినా ఇవ్వకపోవడంపై విసుగు చెందిన భర్త... భార్య మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. చిలకలూరిపేట మండలం యనమదల గ్రామానికి చెందిన పోగుల ఉమామహేశ్వరరావుకు పొన్నూరుకు చెందిన విజయకుమారి​కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉమామహేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్​గా ఉద్యోగం చేస్తున్నారు.

భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తిన కారణంగా.. 2013లో విజయ కుమారి నగరంపాలెం పోలీస్ స్టేషన్​లో భర్తపై కేసు పెట్టింది. అనంతరం ఇద్దరూ రాజీ పడ్డారు. అప్పటి నుంచి జీతంలో కొంత భాగం భార్యకు ఇస్తూనే ఉన్నాడు. అయితే తన నుంచి విడాకులు కావాలని ఉమామహేశ్వరరావు కొంతకాలంగా కోరుతున్నప్పటికీ విజయకుమారి అంగీకరించలేదు. ఈ విషయమై అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్న ఉమామహేశ్వరరావు... శనివారం నేరుగా ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details