ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను హతమార్చిన భర్త.. తర్వాత తాను కూడా..? - crime in guntur

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో భార్యను భర్త హతమార్చాడు. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు.

guntur district
వివాహేతర సంబంధం.. ఓ నిండు ప్రాణం బలి

By

Published : May 16, 2020, 1:12 PM IST

గుంటూరు జిల్లా రేపల్లెలో వివాహేతర సంబంధం నెపంతో భార్యను భర్త హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. రేపల్లెలోని13వ వార్డులో వీరేంద్ర, సౌజన్య దంపతులు నివాసం ఉండేవారు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త వీరేంద్ర.. అర్థరాత్రి 2 గంటల సమయంలో భార్యను హతమార్చాడు.

తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. పురుగుల మందు తాగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. సౌజన్య మరణించి ఉంది. వీరేంద్ర విషమ పరిస్థితుల్లో ఉండగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

2013లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు సంతానం ఉన్నట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. వీరేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైలు

ABOUT THE AUTHOR

...view details