ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త - husband murdered wife news

హైకోర్టులో సహాయకుడిగా పని చేస్తున్న అతను.. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఫూటుగా మద్యం తాగి... భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వెలగపూడిలో జరిగింది.

husband kills wife
మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త

By

Published : Mar 28, 2021, 12:12 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి లో ఓ వ్యక్తి మద్యం మత్తులో తన భార్యను హత్య చేశాడు. హైకోర్టులో సహాయకుడిగా పనిచేస్తున్న దాసు.. శనివారం రాత్రి మద్యం సేవించి భార్య మౌనికతో ఘర్షణకు దిగాడు. మాట మాట పెరిగి టవల్ తో గాని.. దుప్పటి తో గాని మెడకు ఉరేసి హత్య చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు దాసును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details