ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యాపిల్లలను బయటకు గెంటేశాడు..! - husband harasses wife at guntur latest news

ప్రేమ ఆప్యాయతలను పంచి... పిల్లలను, కట్టుకున్న భార్యను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన భర్త... కర్కశంగా మారాడు. భార్యాపిల్లలను రోడ్డుపైకి నెట్టి... ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. తమకు న్యాయం చేయాలంటూ... అర్బన్ ఎస్పీ కార్యాలయలంలో ఫిర్యాదు చేశారు ఆ కుటుంబసభ్యులు.

husband harassment to wife at guntur district
గుంటూరు జిల్లాలో భార్యపిల్లలను రోడ్డుపైకి నెట్టిన భర్త

By

Published : Nov 26, 2019, 4:49 PM IST

భార్యాపిల్లలను బయటకు గెంటేశాడు..!

గుంటూరు జిల్లా నందమూరి తారకరామారావు కాలనీకి చెందిన రమాదేవికి విజయరామిరెడ్డితో 24ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయరామిరెడ్డి గత రెండేళ్ల నుంచి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యా, పిల్లలను వేధించడం ప్రారంభించాడు. శనివారం రాత్రి భార్యాపిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులను బెదిరించాడు. బాధితులు స్థానిక పోలీస్​స్టేష్​లో ఫిర్యాదు చేస్తే... ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ... అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details