ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య వల్లనే చనిపోతున్నా అంటూ.. ఉత్తరం రాసి ఉరేసుకున్నాడు! - భార్య వలన భర్త ఆత్మహత్య వార్తలు

తన చావుకు భార్యే కారణమని లేఖ రాసి ఓ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలో జరిగింది.

husband sucide
husband sucide

By

Published : Jun 9, 2021, 1:01 PM IST

రొంపిచర్లకు చెందిన ఏలికా రామకృష్ణారావు (32)కు ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన యువతితో గతంలో వివాహమైంది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో ఈపూరు స్టేషన్‌లో భర్త, అతని బంధువులపై కేసు పెట్టింది. సోమవారం రామకృష్ణారావు, అతని బంధువులను పోలీసులు ఈపూరు స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు.

ఈ క్రమంలో రాత్రి ఇంటికి చేరిన రామకృష్ణారావు తన చావుకి కారణం భార్య, ఆమె కుటుంబ సభ్యులే అని ఉత్తరం రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున అతన్ని గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో.. రామకృష్ణారావు భార్య, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హజరత్తయ్య తెలిపారు. బాధిత కుటుంబీకులను నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి డాక్టర్‌ అరవిందబాబు పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details